NewsPolitics

ఓయులో బీసీల గొంతు నొక్కే కుట్ర

• ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ సామాజిక న్యాయానికి సవాల్ – గుజ్జ సత్యం.

BC leaders protest against suspension of OU professor Manohar Rao over CAS and discrimination issues

హైదరాబాద్ / తెలంగాణ ప్రతినిధి:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ (OU Professor) మనోహర్ రావును అకారణంగా సస్పెండ్ చేయడం, బీసీలపై కొనసాగుతున్న వ్యవస్థాగత వివక్షకు మరో సాక్ష్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీలకు యూనివర్సిటీల్లో వీసీ, రిజిస్టార్ వంటి కీలక పదవులు దక్కకపోవడమే కాకుండా, ప్రజాస్వామ్యంగా మాట్లాడినందుకే ఉద్యోగాలనే ఊడగొట్టే పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.

కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (CAS) అమలు చేయకపోవడం వల్ల సంవత్సరాలుగా పదోన్నతులు పొందని వందలాది అధ్యాపకుల సమస్యలపై, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో గత 50 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించడమే ప్రొఫెసర్ మనోహర్ చేసిన “తప్పిదమా?” అని గుజ్జ సత్యం ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును అణిచివేయడమే పరిష్కారం అనుకోవడం నియంతృత్వ ఆలోచనలకు నిదర్శనమన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం ఔటా యొక్క రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, సమస్యలను పరిష్కరించాల్సిన వైస్ చాన్సలర్, రిజిస్టార్‌లు చేతులు దులుపుకుని, ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని శిక్షించడం ద్వారా భయాందోళన సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది విద్యా సంస్థా? లేక అణచివేత కేంద్రామా? అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ–ఎస్సీ–ఎస్టీ అధ్యాపకుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి కొంతమంది స్వార్థపర శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలకు యూనివర్సిటీ రిజిస్టార్ నరేష్ రెడ్డి వ్యవహారం ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితిని ఉపాధ్యాయ సమాజం తేలిగ్గా తీసుకోకూడదని, సామాజిక న్యాయ ఉద్యమంలో ఐక్యతే ఆయుధమని గుర్తించాలన్నారు.

బీసీల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే జోక్యం చేసుకుని ప్రొఫెసర్ మనోహర్ రావును విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇది ఒక్క వ్యక్తి సమస్యగా మిగలదని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య ఉద్యమంగా మారుతుందని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలను ప్రశ్నల సమాధులుగా మార్చే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Osmania University Professor Suspension Sparks BC Protest in Telangana

The Osmania University professor suspension has triggered widespread outrage, with BC leaders calling it a clear example of BC discrimination in universities India. The Professor Manohar Rao suspension case has now become a major flashpoint in the ongoing debate over social justice in higher education India.

Reacting strongly, BC welfare leader Gujja Sathyam, in his Gujja Sathyam statement BC welfare, condemned the action and termed it a reflection of deep-rooted bias against Backward Classes. He alleged that Backward Classes issues in higher education continue to be ignored, with BCs being denied key positions like Vice Chancellor and Registrar in universities.

The controversy is closely linked to the ongoing OU Teachers Association protest, which has entered its 50th day. The OU teachers protest 50 days highlights long-pending grievances, particularly the CAS promotion issue university India, which has led to severe university faculty promotion delay India affecting hundreds of lecturers.

Sathyam questioned whether leading a peaceful protest for faculty rights could justify suspension, raising concerns about academic freedom in Indian universities. He warned that suppressing voices of dissent reflects authoritarian tendencies and damages the democratic fabric of educational institutions.

The issue has now escalated into a broader Telangana BC leaders protest, with calls for justice growing louder across the state. Leaders also emphasized that the ongoing situation reflects a serious Telangana education system controversy, pointing to systemic neglect and discrimination.

Further intensifying the matter, allegations have emerged of internal divisions being fueled to weaken the growing BC SC ST unity movement Telangana among faculty members. Critics argue that the handling of the issue exposes a larger university administration controversy OU, with accusations that authorities are attempting to silence collective action rather than resolve genuine concerns.

BC leaders have demanded the immediate reinstatement of Professor Manohar Rao, warning that failure to act could escalate the issue into a statewide agitation. They stressed that the matter is no longer an individual case but a symbol of broader injustice in higher education.

The Professor Manohar Rao suspension case now stands at the center of a growing movement demanding accountability, equality, and true representation in India’s academic institutions.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.