నేడే రాష్ట్ర బీసీ కోర్ కమిటీ సమావేశం – అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో 50శాతం టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్.

దేశ జనాభా లో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో 50శాతం టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కాచిగూడలోని హోటల్ అభినందన్లో ఈ రోజు రాష్ట్ర బీసీ కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటినప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగా ల్లో బీసీలకు న్యాయం జరడంలేదన్నారు. బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం ఆణిచివేస్తున్నదని ఆరోపిం చారు. బీసీలు బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. సమావేశానికి రాష్ట్రంలోని బీసీలంతా తరలిరావాలని కోరారు. ఆయన వెంట ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు ఎర్ర సత్యం, కన్వీనర్ లాలకృష్ణ , బీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.