HealthNews

మహిళా దినోత్సవం సందర్భంగా సత్యం హోమియోపతి ఉచిత చికిత్స.

హైదరాబాద్, మార్చి 07(సత్య తెలంగాణ): కొత్తపేట్ డాక్టర్స్ కాలనీలోని లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఆబిడ్స్ బ్రాంచ్ నందు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికీ సత్యం హోమియోపతి ఉచిత చికిత్స అందిస్తున్నారు. సత్యం హోమియోపతి చైర్మన్ గుజ్జ సత్యం, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ గారిచే ఉచిత వైద్య శిబిరం ప్రారంభించబడినది. అనంతరం గుజ్జ సత్యం మాట్లాడుతూ కార్పొరేట్ హోమియోపతి అందరికి అందుబాటులో అనే లక్ష్యంతో 7 సంవత్సరాల క్రితం మొదటి బ్రాంచి ప్రారంభించామని గుర్తు చేసారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికీ  ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ ఒక నెల ఉచిత మందుల సౌకర్యం కలిగిస్తున్నామని ఈ సౌకర్యాన్ని వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నామని అన్నారు. హోమియోపతి మందులు అన్ని వయసుల వారికి, ఎటువంటి వ్యాధి అయినను వాడవచ్చు మరియు ఈ మందుల వలన ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా సంపూర్ణాంగా  వ్యాధి మూలాల నుండి ఉపశమనం లభిస్తుంది అన్నారు .ఈ సౌకర్యాన్ని పొందటానికి మరిన్ని వివరాల కొరకు ఈ 9121218585 నెంబర్లో సంప్రదించగలరు.