NewsPolitics

బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వంలో బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాచిగూడ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్, కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనా భాలో 54 శాతం ఉన్న బీసీలకు నూతన క్యాబినెట్లో 50 శాతం మంత్రి పదవులూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ విజయానికి బీసీలంతా కృషిచేశారని, వారి ఆకాంక్షలను నూతన ప్రభుత్వం నెరవేర్చుతుందని భావిస్తున్నామని తెలిపారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *