NewsPolitics

బీసీలపై మరో కుట్ర… గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జసత్యం

కుట్రలో భాగంగానే తాము పోటీచేసినా ఓడి పోయే సీట్లనే రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయి స్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్య క్షుడు గుజ్జ సత్యం ఆరోపించారు. రాష్ట్రంలోని బీసీలు గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో స్థానాలను వారికి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయ న్నారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటుచేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటా యించాల్సి ఉందని తెలిపారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఓడిపోయే సీట్లను బీసీలకు కంటితుడుపుగా కేటాయించి అంకెల గారడీ చేస్తున్నాయని పేర్కొ న్నారు. ఆయా పార్టీల మోసాన్ని గమనిస్తున్న బీసీలు రాబోయే ఎన్నికల్లో వాటికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్, జయరాజ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *