NewsPolitics

బీసీ మహిళలకు 50 శాతం ఉప కోటా కల్పించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం.

ఢిల్లీ, మార్చ్ 18 (సత్య తెలంగాణ): చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులో బీసీ మహిళలకు 50 శాతం ఉప కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మట్ట జయంతి గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆల్ ఇండియా బిసి మహిళా సెమినార్ లో గుజ్జ సత్యం మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకు సంబంధించిన ఉప కోటా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా వెనుకబడిన బీసీ మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం పెరగడంతోపాటు రాజ్యా ధికారంలోనూ వాటా దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పద్మావతి, బోను దుర్గా నరేష్, సూర్యనారాయణ, జెల్ల నరేందర్, వెంకట రామయ్య, రూప, రాగవేందర్, నంద గోపాల్, ఉదయ్, పాల్గొన్నారు.