బీసీ మహిళలకు 50 శాతం ఉప కోటా కల్పించాలి.

కాచిగూడ ఫిబ్రవరి 20 (సత్య తెలంగాణ): చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులో.. బీసీ మహిళలకు 50 శాతం ఉప కోటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ మహిళల ఉపకో టాకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించా లని కోరుతూ మార్చి 18న దిల్లీలో జాతీయ బీసీ మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రక టించారు. బుధవారం హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ హోటల్లో.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు జయంతిగౌడ్ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోడపత్రికలను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకు సంబంధించిన ఉప కోటా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా వెనుకబడిన బీసీ మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం పెరగడంతోపాటు రాజ్యా ధికారంలోనూ వాటా దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేతలు గుజ్జ సత్యం, జ్ఞానే శ్వర్, నందగోపాల్, సుధాకర్, ఉదయ్, వంశీకృష్ణ, సునీత, శ్రీనివాస్, ప్రణీత, స్వరూప, భాగ్య లక్ష్మి, జ్యోతి, ప్రమోద, బాలరాజ్, అనూరాధ, హరితిలక్సింగ్ పాల్గొన్నారు.