ధనవంతులు కావాలనే కల.. ధనియాలతో నెరవేరుతుందా..?
ధనవంతులు కావాలనే కల.. ధనియాలతో నెరవేరుతుందా..?
ధనమేరా అన్నిటికి మూలం అన్నాడో కవి. డబ్బు లేకుంటే ఈ ప్రపంచంలో ఏ పని చేయలేం. డబ్బుతోనే అన్నీ పనులు ముడిపడి ఉంటాయి. డబ్బు కోసం ఏదైనా చేయడానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. డబ్బు ఎలాంటిపనినైనా చేయిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే, ప్రతి సంవత్సరం మొదటి రోజున ఈ ఏడాది బాగుండాలి.. బాగా సంపాదించాలి.. డబ్బు ఆదా చేయాలి అనుకుంటారు. దానికి తగ్గట్టుగా పనిచేస్తారు. కానీ, సంపాదించిన సొమ్ము ఏదో ఒక రూపంలో ఖర్చవుతుంది. ఆ ఖర్చుకు తగ్గట్టుగా రాబడి ఉంటుందా అంటే ఉండదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి. ధనవంతులు కావాలనే కల ఎలా నెరవేరుతుంది. అసలు ధనవంతులు అవుతారా లేదా అని తెలుసుకోవడం ఎలా.. ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో ఒక కుండీని తీసుకోవాలి. ఆ కుండీలో ఎర్రమట్టి వెయ్యాలి. నీళ్ళలో కాసిని ధనియాలు వేయాలి. అనంతరం నీటిపై తేలిన ధనియాలు బయట పారెయ్యలి. నీటిలోపల మునిగి ఉన్న ధనియాలను తీసుకొని ఎర్రమట్టి వేసిన కుండీలో వేసి.. దానిపై మరికాస్త మట్టివేసి కప్పాలి. రోజు ఉదయం సాయంకాలం నీరు పోయాలి.
కొన్ని రోజుల తరువాత తప్పకుండా కుండీలో మొలకలు వస్తాయి. మొలకకు పచ్చగా బలంగా ఆరోగ్యంగా ఉంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. మొలకలు పచ్చగా ఉంది.. బలహీనంగా ఉంటే.. డబ్బు అవసరాలకు తగినంతగా అందుతుంది అని అర్ధం. ఇక పసుపు రంగులో ఉంది వాడిపోయినట్టుగా ఉంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు వస్తాయని అర్ధం చేసుకోవాలి. ఇలా కాకుండా అసలు మొలకలే రాకుంటే.. ఆర్ధికంగా ఎటువంటి మార్పు ఉండదని అర్ధం చేసుకోవాలట.