అఖిలపక్ష పార్టీలు బీసీ బిల్లుకు సహకరించాలి – గుజ్జ సత్యం

హైదరాబాద్, మార్చి 07(సత్య తెలంగాణ): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు, న్యాయపరమైన చిక్కులు రాకుండా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, సహకరించేలా, దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన, చేపట్టడంతో పాటు, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలకు ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేసేలా కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు ప్రధాని మోడీని ఒప్పించాలని కోరారు. నిత్యం బీసీ జపం చేసే అఖిలపక్ష పార్టీల నాయకులు కూడా బిసి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని లేనియెడల వచ్చే ఎన్నికలలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.