తెలంగాణలో వచ్చేది బీసీల రాజ్యమే – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

జాతర శోభాయాత్ర
తెలంగాణలో వచ్చేది బీసీల రాజ్యమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జసత్యం అన్నారు. సూర్యాపేట పెద్దగట్టు లింగమంతుల స్వామి అనుగ్రహంతో తెలంగాణలో బీసీ రాజ్యం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన సూర్యాపేట పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. బీసీల రాజ్యం రావడానికి బీసీ లందరూ ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు బీసీలకే వేయాలని అప్పుడే బీసీల రాజ్యాధికారం సిద్ధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రామచందర్ యాదవ్, వట్టే జానయ్య, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సూర్యారావు భూమన్న యాదవ్ పిల్లి రామరాజు చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.