NewsPolitics

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం – ఆర్ కృష్ణయ్య

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య…

బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ, సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 కి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో రెడ్డి జాగృతి వేసిన పిటిషన్ లో ఇంప్లిఎడ్ అయినా ఆర్ కృష్ణయ్య , 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని ఆర్ కృష్ణయ్య కోరారు.