విద్యార్థి దీక్షను విజయవంతం చేద్దాం : బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య

42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో బిసి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీ నుండి 8 వరకు ఏర్పాటుచేసిన విద్యార్థి దీక్షకు మద్దతుగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , నారగోని , బిసి జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం మాట్లాడుతూ….
బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని,సామాజిక న్యాయం కొరకు జరుగు అన్ని ఉద్యమాలకు అన్ని బీసీ సంఘాలు,బీసీ జేఏసీ,కుల సంఘాలు మద్దతుగా నిలవాలన్నారు.భవిష్యత్‌లో బిసి జరుగు ఉద్యమానికి విద్యార్థులే ముందుండి కొట్లాడలన్నారు…
నవంబర్ 4 నుండి నవంబర్ 8 వరకు జరుగు దీక్ష వివరాలు…
*జ్యోతిరావు పూలే,సావిత్రిబాయ్ పూలే మార్గ దీక్ష_Nov 4*
*సాహు మహరాజ్,డా౹౹బి.ఆర్ అంబెడ్కర్ ఆశయ దీక్ష_Nov 5*
*సర్వాయి పాపన్న,పండుగ సాయన్న,కొండా లక్ష్మణ్ బాపూజీ సమర దీక్ష_Nov 6*
*బిపి మండల్,కర్పూరి ఠాకూర్ కార్య దీక్ష_Nov 7*
*చిట్యాల ఐలమ్మ,సంఘం లక్ష్మీభాయి ఐక్యత దీక్ష_Nov 8*
బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్స్ కొమ్మనవెన సైదులు, గౌరవ అధ్యక్షులు రాజేష్ , బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధి నూకల మధుయాదవ్, రాజు నేత ,లింగం యాదవ్,Vamsi , vasu Yadav,
సంతోష్,ప్రణయ్,కాసిం,అంజి యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు

