పరీక్ష లేకుండా అకాడమిక్ మెరిట్ తో సెంట్రల్ రైల్వే లో ఉద్యోగ అవకాశం..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 2196 ఉద్యోగాలు అందరికి తెలిసేలా షేర్ చేయండి. పరీక్ష లేదు ఇంటర్వ్యూ కూడా లేదు.. అర్హతలు: 10 వ తరగతి పాస్, మరియు ITI చదివి ఉండాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) – సెంట్రల్ రైల్వే 2196 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అప్రెంటిస్ వ్యవధి ఆ విభాగాన్ని బట్టి ఏడాది లేదా రెండేళ్లు ఉంటుంది. అప్రెంటిస్‌గా చేరినవారికి స్టైపెండ్ చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఆయా క్లస్టర్ల వారీ ఖాళీల వివరాలు: ముంబయి -1503 , భుసావాల్ -341, పుణే-151, నాగ్‌పూర్-107, షోలాపూర్-94.
విభాగాలు: డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టైలర్, పెయింటర్, ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టూల్ & డై మేకర్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, షీట్ మెటల్ వర్కర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగం/ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి: 01.11.2017 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే నవంబరు 1, 1993 – నవంబరు 1, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీలైతే నవంబరు 1, 1988 – నవంబరు 1, 2002 మధ్య జన్మించాలి. ఓబీసీలు నవంబరు 1, 1990 – నవంబరు 1, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మార్కులు, ఐటీఐ ట్రేడ్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పదోతరగతి, ఐటీఐ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుంది. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
ఎంపికైతే: ఎంపికైనవారికి అప్రెంటీస్‌గా తీసుకుంటారు. అభ్యర్థి ట్రేడ్‌ను బట్టి ఏడాది లేదా రెండేళ్లు అప్రెంటీస్‌గా కొనసాగుతారు. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అప్రెంటీస్ ద్వారా రైల్వే ఉద్యోగానికి ఎలాంటి హామీ ఉండదు. అయితే ఈ అప్రెంటీస్ శిక్షణతో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో సంబంధిత ట్రేడ్‌ల్లో లభించే ఉద్యోగాలను పొందడం సులువవుతుంది. కొన్ని ట్రేడ్‌ల్లో స్వయం ఉపాధి ద్వారా రాణించే అవకాశాలు ఉన్నాయి. విలువైన పని అనుభవానికి అప్రెంటీస్ విధానం దోహదపడుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2017.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2017 (సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్‌సైట్: www.rrccr.com.