FilmViral

పరిటాల రవి గుండు కొట్టిన్చారనే వార్త పై స్పందించిన పవన్ కళ్యాణ్, ఏమన్నారో తెలుసా ..!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు దివంగత టీడీపీ నేత పరిటాల రవి గుండు గీయించినట్లు అప్పట్లో ఓ సంచలనమైన విషయం ప్రచారంలో ఉండేది. అయితే దానిని తెలుగుదేశంలో కొంతమంది ఈ ప్రచారం చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. అంతేకాదు తనకు గుండు గీయించాడని టీడీపీ ప్రచారం చేసిన పార్టీకే మద్దతు ఇచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గుర్తుచేశారు. టీడీపీకి మద్దతు ఇవ్వడం వెనుకు కులాల మధ్య ఐక్యత సాధించే లక్ష్యం కూడా ఉందన్నారు.

‘‘గుండు గీయించారనే ప్రచారం 1998 నుంచి మూడేళ్లు ఆ ప్రచారం పెరిగి.. వార్త పత్రికల్లో వేసే స్థాయికి వచ్చింది. నాకు ఎవరో గుండు గీయించారట… నన్ను కొట్టారట అని. నేను సినిమాలు తీసి విసిగిపోయి.. జుట్టుపై దృష్టి పెట్టలేక.. వంద కోపాలతోటి ఇక జుట్టు వద్దని తీయించుకున్నాను. కానీ ఈ ప్రచారం చేసిన వాళ్లు టీడీపీకి చెందిన వారే. వాళ్లు నాకు తెలుసు. ఈ రోజుకు వాళ్లు కనిపిస్తున్నారు అప్పడప్పుడు. చంద్రబాబుకు తెలిసివుండకపోవచ్చు. కొంత మంది ప్రచారం చేసి ఉండచ్చు. వాళ్ల సరదా అది. పరిటాల రవి జీవిత చరిత్ర రాసిన వ్యక్తి ఇలా రాశాడు. పరిటాల రవి, పవన్‌కల్యాణ్‌ను కలువకపోయిన.. ఈ విషయాన్ని రవి ఖండించలేదని అందులో రాశారు. అప్పటిదాక అది అపోహగానే ఉండేది. ఇది జరిగి ఉండచ్చని.. నా మీద అలా జరిగితే నేను ఊరుకుంటానా’’ అని ఆవేశంగా చెప్పారు. ఇక గతంలో ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిందంటే..

ఈ విషయంపై ఇప్పటికీ ఫ్యాన్స్ తిట్టుకోవడం, ఇంటర్నెట్ లో వెతుక్కోవడం, కామెంట్స్ పాస్ చేసుకోవడం జరుగుతూనే ఉంది. అప్పట్లో జరిగిన ఊహాత్మకమైన ప్రచారం ప్రకారం.. పరిటాల రవి ఇంటికి ఆనుకొని ఉన్న యాక్టర్ జగ్గారావు కు చెందిన స్థలాన్ని చిరంజీవి 10లక్షలకు కొన్నాడు. అందులో 7లక్షలు డబ్బులు ఇచ్చి మిగిలిన రూ. 3లక్షలు తరువాత ఇస్తానని అన్నాడట చిరంజీవి. ఆ మూడలక్షల దగ్గర ఎందుకో వివాదం తలెత్తింది. ఈనేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ బాంబుపేలుళ్లు జరిగాయి. దీంతో భద్రత దృష్ట్యా మరింత సెక్యూరిటీ కోసం పరిటాల రవి ఆ స్థలాన్ని చిరంజీవిని తనకు అమ్మమని దానికి బదులుగా మాదాపూర్ లో ఎకరం ల్యాండ్ ఇస్తానని జగ్గారావుకు మూడు లక్షలు ఇచ్చి ఆ ఇష్యూని క్లియర్ చేశాడట.

ఈ ల్యాండ్ గొడవలో పవన్ కల్యాణ్ హస్తం ఉందా..? అంటే లేదనే అంటున్నారు నెటిజన్లు…? ఎందుకంటే చిరంజీవి కుతూరికి, ఉదయ్ కిరణ్ కు జరిగే నిశ్చితార్ధానికి మీడియాని అనుమతించలేదు. కానీ కొంతమంది జర్నలిస్ట్ లు గోడ చాటుగా, ఇంట్లో వాళ్లకు తెలియనీయకుండా ఫోటోస్ తీయడం చూసిన పవన్ వాళ్లని కొట్టాడు. అందులో ఓ జర్నలిస్ట్ నెల్లూరు వాసి. ఆ కోపంతో ఏ ప్రూఫ్ లేని ఈ గుండు స్టోరీని పుట్టించేసి ….జగ్గారావు, చిరంజీవి వివాదంలో పరిటాలపై పవన్ దాడికి దిగాడని, కోపంతో రగిలిపోయిన పరిటాల..,పవన్ కు గుండు కొట్టించాడని నెల్లూరు జిల్లానుంచి విడుదలయ్యే జమీన్ రైతు అనే పత్రిక ప్రింట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక యాంటీ ఫ్యాన్స్ దీనికి విస్తృత ప్రచారం కల్పించారు.

సరిగ్గా జానీ సినిమాకు రెండు రోజుల ముందు ధర్నాకు దిగడంతో ఇన్నాళ్ల తరువాత వస్తున్నాడు కథా ప్రమోషన్ కోసం ఎత్తుగడ అని దీన్ని మరోవర్గం వారు విసృతంగా ప్రచారం చేశారు. లేకపోతే గొడవ జరిగింది ఎప్పుడు..? ప్రింట్ చేసింది ఎప్పుడు..? వచ్చి గొడవ చేసేదెప్పుడు అని ఎదురు దాడికి దిగాయి. స్వయంగా పవన్ కల్యాణే రోడ్డు బైఠాయించి ధర్నా చేసినా, అభిమానులు తన్నుకున్నా సరైన సమయంలో నిజాన్ని భయటపెట్టకపోవడం వల్ల అన్ సోల్డ్ రూమర్ గానే మిగిలిపోయింది పవన్ కల్యాణ్ మీద వచ్చిన అపవాదు.

దీనికి తోడు పవన్ కల్యాణ్ కు పెద్దగా సక్సెస్ లేక సినిమాలు ఫెయిల్ అయి సినిమాల్ని థియేటర్స్ నుంచి తీసేస్తుంటే.. పరిటాల రవి కావాలనే తన నియోజకవర్గంలో పవన్ సినిమాల్ని ఆడనీయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయం పరిటాల రవికి పెద్ద తలనొప్పిగా మారింది. అల్లు అరవింద్ డీసీఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లి ఫ్రూప్స్ అడిగినా ఇవ్వలేకపోయారు ఆ జర్నలిస్ట్ లు. ఇవాళ రేపు అని దాట వేస్తూనే వచ్చారు. చివరికి చిరంజీవి ఫ్యామిలీ నెల్లూరు లో ఫ్రింట్ అయిన జమీన్ రైతుపై పరువునష్టం దావా వేయించారు.

ఈ ఇష్యూ జరిగిన రెండు సంవత్సరాల తరువాత ఇదే విషయాన్ని పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో పొందుపరిచారు. 177,178 పేజీల్లో పవన్ కు తనకు గొడవలు లేవని..పనిమీద వెళ్లిన తనకి పవన్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఓ వ్యక్తి పరిచయం చేశాడని..అలా పవన్ తో ఒక్కసారే మాట్లాడినట్లు తన ఆత్మకథలో వివరించారు. తన సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ తన క్రియేటివిటీని ఊపయోగించి ఈ గుండు సీన్ తో తన సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడంలో సక్సెస్ కాగలిగాడు. మొత్తానికి దీనికి ఇన్నాళ్లకు క్లారిటీ లభించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *