NewsUsefulViral

ఇది చదివి మెట్రో రైలు ఎక్కండి..!!

ఇది చదివి మెట్రో రైలు ఎక్కండి..!!

తొలిరోజు మెట్రోరైలు ప్రయాణం సిటీ బస్సునే తలపించింది. జనాలు ఎక్కువగా వచ్చేసరికి సీటింగ్ సరిపోక… నిలబడ్డానికి చోటుంటే చాల్లేఅనుకున్నారు జనాలు. లక్షమందికి పైగా అంచనాకు మించిన జనం తొలిరోజు రైలు ప్రయాణం చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రేట్లు ఎక్కువున్నాయని వినిపించినప్పటికీ.. జనం సంతృప్తిగానే కనిపించారు. పొల్యూషన్ ఫ్రీ ప్రయాణం… సమయం ఆదా కావడం లాంటి సౌకర్యాలు ఉండటంతో… సిటీ ఏసీ బస్సులతో పోల్చుకుని ఫర్వాలేదు.. భరించొచ్చని అంటున్నారు పబ్లిక్. నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లాలనుకునేవాళ్లు రెండు ట్రైన్లు ఎక్కాల్సి రావడం వల్ల చార్జీ కూడా ఎక్కువే పడుతుంది.

ఐతే… మెట్రో రైలు ప్రయాణం ఎంత కొత్త అనుభూతిని పంచినా.. ప్రయాణంలో కొంత ఆలస్యం కూడా జరుగుతోంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురయ్యాయి. ప్రతి స్టేషన్ లో ట్రెయిన్ 30 సెకన్లు ఆగుతుంది. ఆటోమేటిగ్ గా డోర్ ఓపెన్, క్లోజ్ అయిపోతుంటాయి. ఐతే.. కొన్ని స్టేషన్లలో 5 నుంచి 10 నిమిషాల వరకు ట్రెయిన్ ఆగిన సందర్భాలున్నాయి. ఆగినా.. కదిలినా..స్లో అయినా.. స్పీడందుకున్నా… డోర్లు ఓపెనైనా, క్లోజైనా… ఆడియో అనౌన్స్ మెంట్ వస్తుంటుంది. ఇది సౌకర్యంగా అనిపిస్తుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రయాణికుడికి అందడంతో.. మెట్రో సేవలపై అందరూ సాటిస్ ఫై అవుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు సగటు స్పీడ్ 33 కిలోమీటర్లు. కొన్నిసార్లు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరికొన్ని సార్లు డెడ్ స్లోగా కూడా నడుస్తుండొచ్చు. ట్రాక్ పై మరో రైలు సరైన దూరంలో లేకపోయినా… ప్లాట్ ఫామ్ పై రష్ ఎక్కువున్నా.. అప్పుడప్పుడూ స్లో అవుతుంది. ఆలస్యానికి క్షమించండి.. ఆలస్యం కొనసాగుతున్నందుకు చింతిస్తున్నాం లాంటి అనౌన్స్ మెంట్లు వినిపిస్తాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రతి అనౌన్స్ మెంట్ వస్తుంది.

ఆగిన స్టేషన్… వచ్చే స్టేషన్ అన్ని వివరాలు రైరులో ప్రతి డోర్ పైన టీవీలో కనిపిస్తుంటాయి. ప్రతి మెట్రో రైలులోనూ ఎక్కడ నిల్చోవాలో అనే ఇబ్బందిలేదు. స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పైన ఎల్లో కలర్ తో మార్కింగ్ చేసి పెట్టారు. ఎక్కేందుకు దారి అని మార్కింగ్ చేసిన దగ్గర నిల్చుంటే… రైలు పెట్టే సరిగ్గా అక్కడే ఆగుతుంది. డోర్ మన ముందే ఉంటుంది. ఎల్లో మార్కింగ్ ఇవతలే నిల్చుని ఉండటం మంచిది. ఈరకమైన సహాయం అందించేందుకు అక్కడ రెండువైపులా మెట్రో సిబ్బంది సిద్ధంగా ఉంటున్నారు.

అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ జంక్షన్. అక్కడ రెండు రైలు మార్గాలుంటాయి. నాగోల్ నుంచి వచ్చినవారు కిందనుంచి పైకి వచ్చి.. అమీర్ పేట్ నుంచి మియాపూర్ వెళ్లాలి. మొత్తం రూట్లు పూర్తి కాకపోవడంతో.. నాగోల్ నుంచి అమీర్ పేట్ డెడ్ లైన్ గా పెట్టారు. ఇటు మియాపూర్ నుంచి అమీర్ పేట్ లాస్ట్ స్టాప్ అయ్యింది.

పార్కింగ్ వసతులు చాలా స్టేషన్లలో లేవు. స్టేషన్ బయట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బైక్ లు పెట్టుకుంటున్నారు. చాలా మెట్రో రైళ్లకు ఇంకా పార్కింగ్ స్థలం అందుబాటులోకి రాలేదు. రోడ్డుపైకి దిగేందుకు రెండువైపులా మెట్లు ఉండటంతో… ముందే డిసైడ్ చేసుకుని దిగడం బెటర్. తర్వాత రోడ్డు దాటే అవసరం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *