బిసిలకు రిజర్వేషన్ల అమలు తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

సత్యతెలంగాణ హైదరాబాద్ : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుందనీ 42 శాతం కు బిసి రిజర్వేషన్ల పెంచే విషయంలో ఇంతవరకు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదనీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. సోమవారం జరిగిన ఒక మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ ఒకసారి 42 శాతం రిజర్వేషన్లు పెంచనున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంకోసారి పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారనీ ఇలా వివాదాస్పదమైన ప్రకటనలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం ఆన్నారు. పార్టీ పరంగా టికెట్లు వద్దు – ఆ బిక్షం వద్దు హక్కు కావాలన్నారు. ‘హక్కు యుంటే అన్నీ పార్టీ టికెట్లు ఇస్తారనీ పార్టీ పరంగా ఇస్తే అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 42 శాతం కు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఎలాంట్ అవరోదాలు లేవన్నారు. వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఎలా వెళ్ళడం న్యాయం కాదన్నారు.
వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ, 73-74వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డి6 ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చిందన్నారు.