తెరాస పార్టీ ని ఏమీ చేయలేరు… మంత్రి కెటిఆర్
★రాహుల్ గాంధీ కాదు,
★వాళ్ల అమ్మ జేజేమ్మ దిగొచ్చినా
★సియం కేసిఆర్ గారిని కాని
★తెరాస పార్టీ ని ఏమీ చేయలేరు… మంత్రి కెటిఆర్
తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల టీడీపీనీ వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి గొంగల్లో కూర్చొని వెంట్రుకలు ఏరుతున్నాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు.స్కాంలతో నిండిన కాంగ్రెస్‌లో మరో దొంగ చేరాడని, నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీశాడంటూ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు . కాంగ్రెస్ చరిత్రంతా కుంభకోణాల మయం.. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని, గాంధీ మాటను మరిచిన కాంగ్రెస్ 1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను పిట్టలను కాల్చినట్లు కాల్చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.‘రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు’ అన్నారు.
నాడు కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు బాస్ లు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్ లని, వేరే వాళ్లెవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు . వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా తెలుసని అన్నారు. టీఆర్‌ఎస్‌తో 2004లో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని, అలాగే పాలమూరు వలసలను సృష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు . ఈ చేరిక కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.