LifestyleTrendyUseful

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఇలా చేయండి

జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారా? అయితే ఇలా చేయమంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. శనికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. చేసిన పనికి తగిన ప్రతిఫలం లభించకపోతే.. పనితీరుపై శ్రద్ధ తగ్గించకుండా.. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే.. శని ప్రీతి కోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహారం పెట్టండి.
 
ఆ తర్వాతే మీరు ఆహార పానీయాలను తీసుకుంటే మీకు ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. శనిభగవానుడు కాకుల్లో వుంటాడని.. యమధర్మరాజుకు కూడా కాకి ప్రీతికరమని.. నిజాయితీకి, ధర్మానికి ప్రతీకలుగా వీరిద్దరినీ చెప్తారు. అలాంటి ఇద్దరికీ ప్రీతికరమైన కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా తృప్తి చేస్తే.. ఆరోగ్యంతో పాటు సౌభాగ్యాలను కూడా వారు ప్రసాదిస్తారని పండితులు చెప్తున్నారు.
 
అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే.. గురుభగవానుడి అనుగ్రహం తప్పనిసరి. వృత్తి ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే.. గురువారం పూట గోవులకు పచ్చని గ్రాసం, అరటిపండు తినిపించండి. గురువులకు చేతనైన కానుకలు ఇచ్చి వారి ఆశీస్సులు పొందండి.
 
అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోండి. ఆంజనేయ విగ్రహం కుడికాలి బొటనవేలి వద్ద సింధూరాన్ని సేకరించి, నుదుట తిలకంగా దిద్దుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతి నెలా ఏదైనా గురువారం ఇంటికి దగ్గరలో వున్న ఆలయానికి తీపి గుమ్మడికాయను సమర్పించుకుంటే, పురోహితులకు వస్త్రదానం చేస్తే.. ఆర్థికపరంగా ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితుల సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *