ఆదివారమే దేశానికి పేరయ్యింది! అ దేశం ఏంటో తెలుసా?
పేరులో ఏమి వుంది అన్నాడు మహా కై షేక్స్ పియర్ కాని ఉన్నదంతా పేరు లోనే వుంది. ప్రపంచంలో మనకు తెలియని దేశాలు చాలా ఉన్నాయ్ వాటి పేర్లు వింటే మనకు ఆశర్యం కలుగ్తుంది. కొన్ని దేశాల పేర్లు చూస్తె నవ్వు వస్తుంది. ఆదివారమే దేశానికి పేరయ్యింది! అది ఎక్కడ ఉంది?అసలు దాని పేరు వెనక కారణం మీరూ తెలుస్కోవాలంటే ఇది చదవండి.డొమినిక…. పర్వతాలతో కూడిన బుల్లి ద్వీప దేశమిది. దీనికి తూర్పున అట్లాంటిక్ సముద్రం, పశ్చిమాన కరేబియన్ సముద్రం, ఫ్రెంచ్ ద్వీపాలైన గ్వాడెలూప్ ఉత్తరాన, మార్టినిక్యూ దక్షిణాన ఉంటాయి.
ఈ దేశం చాలా చిన్నది. మన హైదరాబాద్ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. క్రిస్టఫర్ కొలంబస్ ఈ ద్వీప దేశాన్ని 1493లో దర్శించాడు. ఈయన అడుగుపెట్టింది ఆదివారం కావడంతో దీన్ని డొమినిక ద్వీపం అని పిలిచాడు.డొమినిక’ అంటే లాటిన్ భాషలో ఆదివారం.ఈ దేశంలో పెద్ద నగరం రాజధాని రోసియు. జనాభాలో ఎక్కువ శాతం నివసించేది ఇక్కడే.ఈ దేశంలో మొత్తం 365 నదులు, బోలెడు జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు కనిపిస్తాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద వేడి నీటి సరస్సు ఉండేది ఇక్కడే. పేరు ‘బాయిలింగ్ లేక్’. రాతి యుగం నాటి ‘ఒరినొకొ’ తెగలు ఇక్కడ మొదటి సారిగా అడుగుపెట్టాయిడోమినికా వైవిద్యమైన సంప్రదాయాలకు చెందిన ప్రజలకు నిలయంగా ఉంది.
చారిత్రకంగా ఈదీవి పలు స్థానికజాతి ప్రజలచేత ఆక్రమితమై ఉంది. యురేపియన్ సెటిలర్లు ఈదీవికి రావడానికి ముందు అరవాకన్ ప్రజలు (టైనోస్) మరియు కరీబియన్లు (కలింగొ) గిరిజనప్రజలు ఈదీవిలో నివసిస్తూ ఉన్నారు.ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ సెటిలర్లు ఈద్వీపంలో నివసుస్తున్న స్థానిక ప్రజలను మూకుమ్మడి హత్యలకు గురిచేసి ఈద్వీపాన్ని ఆక్రమించుకున్నారు. స్థానికప్రజల రక్తంతో నదీజలాలు ఎరుపువర్ణంతో ప్రవహించాయి.