హార్ట్ అటాక్ ను కంట్రోల్ చేసే ఆకులు
హార్ట్ అటాక్ ను కంట్రోల్ చేసే ఆకులు
మన హిందూ సాంప్రదాయంలో మూలికల రాణి అంటే తులసిని అభివర్ణిస్తారు. దాదాపు 5వేల సంవత్సరాల క్రితమే అనారోగ్య సమస్యలకు తులసిని చక్కటి దివ్య ఔషదంగా ఉపయోగించారు. అలాంటి తులసిని రకరకాల మందుల తయారీల్లో ఉపయోగించి రోగాలను తరిమికొడుతున్నారు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోజుకు ఓ రెండు తులసి ఆకుల్ని నమిలితే అనారోగ్య సమస్యలు రావు. వచ్చినా వాటిని నిలువరించే శక్తి ఈ తులసి ఆకులకి ఉంటుంది.
అందుకే తులసి మొక్కకు అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే వాతావరణ మార్పుల వచ్చే వ్యాధులు కానీ, దగ్గు, శ్వాసకోశ సంబంధమైన సమస్యల్ని దూరం చేయాలంటే తులసి అకుల్ని తినాలి. తద్వారా ఆకుల్లో ఉన్న ఔషద లక్షణాలు జ్వరము, తుమ్ములు, వైరల్ నుంచి విముక్తి పొందొచ్చు. అంతేకాదు తులసిలో కొంచెం నిమ్మరసం కలిపితీసుకుంటే కిడ్నీల్ని శుభ్రం చేయడమే కాదు రాళ్లను కూడా కరిగిస్తుంది. ఒత్తిడి వల్ల యవ్వనం లో ఉన్నవారు హార్ట్ అటాక్ వల్ల మరణించేవారు చాలా మంది ఉన్నారు.