దశాబ్ది ఉత్సవాల వేళ 30 రోజుల ఉచిత చికిత్స -సత్యం హోమియోపతి చైర్మన్ గుజ్జ సత్యం వెల్లడి

హైదరాబాద్, జూన్ 02 : కార్పొరేట్ హోమియోవైద్యం అందరికీ అందుబాటులో లభించాలనే లక్ష్యంతో సత్యం హోమియోపతిని 2018లో స్థాపించబడిన సత్యం హోమియోపతిలో సుదీర్ఘ అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది అందించిన సేవలకుగాను జాతీయ స్థాయిలో బెస్ట్ హోమియోపతి అవార్డు లభించినట్లు సత్యం హోమియోపతి చైర్మన్ గుజ్జ సత్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో తెలంగాణ దశాబ్ది దిఉత్సవాలు సందర్బంగా 30 రోజులపాటు జూన్ 2 వ తేదీ నుండి జులై 2 వ తేదీ వరకు ఉచిత హోమియోవైద్య శిబిరం నిర్వహించి, ఒక నెల మందులను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామజిక సేవలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో హెల్త్ క్యాంపుల ద్వారా హోమియోపతి మందులను, సేవలను కొన్ని వేల మందికి ఉచితంగా ఇచ్చామన్నారు. కరోనా కాలంలో ఉచిత హోమియోపతి ఇమ్మ్యూనిటి బూస్టర్ ద్వారా ఎన్నో వేల మందికి ఇమ్మ్యూనిటి పెంచడం ద్వారా చేయూత అందించామన్నారు. ఆన్ లైన్ కన్సల్టేషన్, కొరియర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ రాధిక, డాక్టర్ గాయత్రి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించు కోవాలనుకునేవారు ఫోన్ : 9121219595, 7337476161, 7337477171 నెంబర్లలో సంప్రదించాలన్నారు.