NewsPolitics

ఫీజు బకాయిల విడుదలపై సీఎం స్పందించాలి – గుజ్జ సత్యం 

  • విద్యతోనే బీసీల అభివృద్ధి – సమస్యపై సీఎం దృష్టి సారించాలి

హైదరాబాద్ (సత్య తెలంగాణ): బీసీ విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి  వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఉన్నత విద్యను అభ్యసించే లక్షలాది మంది బీసీ విద్యార్థులకు రూ.5 వేల కోట్లకు పైగా ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ బకాయిల సమస్య వల్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల చెల్లింపు ఆలస్యం కారణంగా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 30% బీసీ విద్యార్థులు తమ చదువును కొనసాగించలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నా రన్నారు.

2024-25 బడ్జెట్‌లో బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీయంబర్స్మెంట్ కోసం కేటాయించిన నిధులలో కేవలం 20% మాత్రమే ఈ బకాయిల కోసం విడుదల చేయడం సిగ్గుచేటు అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి  తక్ష ణమే ఫీజు బకాయిలు విడుదల చేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. లేదంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.