ప్రజా సమస్యల పై కలిసి పని చేద్దా: కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్.

టిఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన అంతమొందించేందుకు ప్రజలంతా ఏకధాటిపై రావాలని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ అన్నారు. శుక్రవారం నాగోల్ లోని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఇంటికి మద్దతు కోరుతూ వచ్చాడు. ఈ సందర్భంగా
గుజ్జ సత్యం మాట్లాడుతూ గతంలో బీసీ దళపతి అయిన ఆర్ కృష్ణయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామని, ఈసారి ఎల్బీనగర్ లో బీసీ బిడ్డ అయిన మధు యాష్కీ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతామని అన్నారు. బీసీలను రాజకీయ పార్టీలు ఓటు వేసే యంత్రాలు గానే గుర్తిస్తున్నారా తప్ప, రాజ్యాధికారంలో వాటా ఇస్తలేరని అన్నారు.
బి అర్ ఎస్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వందల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బి.ఆర్.ఎస్ పార్టీని ప్రజలు గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేపట్టారని, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయలేదని ఆయన విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కల్వకుంట్ల కుటుంబం ఒకటే బంగారు కుటుంబంగా మారిందని, పేద ప్రజల బతుకులు మారలేదని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు. విద్యావంతుడు రాజకీయవేత్త అయిన మధుయాష్కిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.
కార్యక్రమంలో చంపాపేట్ కార్పొరేటర్ రాజేందర్ రెడ్డి ఎల్బీనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పున గణేష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం, మమత నగర్ కాలనీ ప్రతినిధులు అమరేందర్ రెడ్డి ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్, రాపోలు నరసింహ ,గడ్డం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.