బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటిననా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరడంలేదని, బీసీలకు రాజ్యాంగపర మైన హక్కులను కల్పించకుండా కేంద్రం ఆణిచి వేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. సోమవారం కాచిగూడలో ఆయన మాట్లాడుతూ బీసీ సమ స్యల పరిష్కరానికి రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణ య్య ఆధ్వర్యంలో ఈ నెల వేలాది మందితో చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేప ట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్లను ప్రవేశపె ట్టాలని, క్రిమిలేయర్ను రద్దు చేయాలన్నారు. కార్య క్రమంలో పిళ్లా నివాస్, సురేశ్, కిరణ్, సతీశ్, కృష్ణ, శ్రీనివాస్, నాగేశ్వర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.