NewsPolitics

బిసి కమీషన్ కు విజ్ఞప్తి చేయండి.రాష్ట్ర బీసీలకు గుజ్జ సత్యం సూచన.

అక్టోబర్ 28 నుండి 13 నవంబర్ వరకు 17 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన* చేస్తున్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా జిల్లాల నాయకులు బీసీలకు కావలసిన వివిధ అంశాలపై విజ్ఞప్తులను సమర్పించండి.

*ఈ క్రింది తేదీలలో ఆయా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో బీసీ కమీషన్ చైర్మన్ మరియు సభ్యులకు విజ్ఞప్తులు సమర్పించవలసి ఉంటుంది*

28 అక్టోబర్ ఆదిలాబాద్

29 అక్టోబర్ నిజామాబాద్

30 అక్టోబర్ సంగారెడ్డి

1 నవంబర్ కరీంనగర్

2 నవంబర్ వరంగల్

4 నవంబర్ వరంగల్ 

5 నవంబర్ ఖమ్మం

7 నవంబర్ రంగారెడ్డి 

8 నవంబర్ మహబూబ్నగర్

11 నవంబర్ హైదరాబాద్

12, 13 నవంబర్ కమీషన్ కార్యాలయంలో బీసీ చైర్మన్ మరియు కమిషన్ సభ్యులు అందుబాటులో ఉంటారు.

కులగనన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు భూముల కేటాయింపులు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో బీసీల జనాభా దామాషా రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్, బడ్జెట్లో వాటా, వివిధ కులవృత్తుల వారికి/ సేవా కులాల వారికి ప్రత్యేక సబ్సిడీ పథకాలు మరియు బీసీ కులాల ఉత్పత్తిలకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైన సెజ్ లు, బీసీ కులాల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం వంటి అంశాలతో పాటు కులాల వారీగా సమస్యలు పరిష్కారాలు పేర్కొంటూ విజ్ఞప్తులు సమర్పించగలరు

డిమాండ్లు.

1. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడున్న 23 శాతం రిజర్వేషన్ బీసీ జనాభాకు ఏమాత్రం సరిపోదు.

2. వార్షిక బడ్జెట్లలో ప్రతి వార్షిక సంవత్సరం 50% బడ్జెట్ బీసీలకు కేటాయించాలి

3. చట్టసభల్లో పార్లమెంటు అసెంబ్లీలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి

4. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఐదు శాతం జనాభాలేని వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన బీసీలు అత్యధికంగా నష్టపోతున్నారు కావున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః పరిశీలించాలి.

5. టి జి పి ఎస్ ఎస్ సి 29 జీవోను రద్దు చేయాలి

6. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలి

7. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారిని సబ్ క్యాటగిరీ చేసి వారి జీవన ప్రమాణాల పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలి.

8. పారిశ్రామిక పాలసీలలో అన్ని అంశాల్లో ఇన్పుట్ సబ్సిడీ, ప్లాట్ల కేటాయింపులలో కనీసం 50% కేటాయించాలి. బీసీ మహిళలకు 50 శాతం కేటాయించాలి

9. బీసీ కులవృత్తుల ఆధునికరణకు, ఇతర రంగాలలో బీసీల ఆర్థిక ఎదుగుదలకు బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ కేటాయించాలి

10. సంచర జాతులకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ)లకు ప్రత్యేకముగా రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తిలో వర్గీకరించి అమలు చేయాలి.

11. బీసీ సంక్షేమ పథకాలలో,  ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులలో 50%   కేటాయించాలి

12. గురుకుల అడ్మిషన్లలో ఇతర రెసిడెన్షియల్ పాఠశాల అడ్మిషన్లలో 50%  కేటాయించాలి

13. అన్ని జిల్లాలలో బీసీలకు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. కోచింగ్, ఉచిత రెసిడెన్షియల్ వసతి కల్పించాలి.

14. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలి, పూర్తి రియంబర్స్మెంట్ చెల్లించాలి. మరియు పాత బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. వసతి గృహాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, సొంత భవనాలు నిర్మించాలి.

15. కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన విధంగా బీసీలకు కాంట్రాక్టులలో 42% వాటా కల్పించాలి.

16. కులవృత్తుల/ చేతివృత్తుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రాజధానిలో ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేసి వస్తులను అమ్ముకునే సౌకర్యం కల్పించాలి. 

మీ 

గుజ్జ సత్యం

జాతీయ ఉపాధ్యక్షుడు 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం