తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

న్యూఢిల్లీ, మార్చి 18 (సత్య తెలంగాణ): బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం న్యూఢిల్లీలో పలువురు ఎంపీలను, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎంపీ బీద మస్తాన్ రావు, సిపిఐ సీనియర్ నేత అజీజ్ పాషా, బిజెపి ఎంపీ రఘునందన్ రావు, తదితరులను ఈ సందర్భంగా గుజ్జ సత్యం కలిశారు.