బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే గుణపాఠం తప్పదు – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

హైదరాబాద్: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి తగిన బుద్ది చెబుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హెచ్చరించారు. బీసీలు అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 42 శాతం రిజర్వేషన్లను సాధించు కున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి బీసీ అభ్యర్థు లంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాచిగూడ లో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్నయ్య నిరంతర పోరాట ఫలితంగానే ప్రభుత్వం స్పందించి 42 శాతం రిజర్వేషన్లకు జీవో నంబరు 9 జారీ చేసినట్టు తెలిపారు. దీంతో అట్టడుగున ఉన్న బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్ని కల ద్వారా చట్ట సభలలో ప్రాతినిధ్యం దక్కుతుందని, తద్వారా బీసీలకు సామాజిక న్యాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియకు రాజ్యాంగ బద్ధత, న్యాయబద్ధత, చట్టబద్దత ఉందన్నారు. రిజర్వేషన్లు అంటే గిట్టని వారు 50 శాతం సీలింగ్ ఉందనే దుష్పాచారం చేయడమే కాకుండా, కోర్టుకు వెళ్లి అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం వెనుకడుగు వేయవద్దని సూచిం చారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు గుర్తుకురాని 50 శాతం సీలింగ్ బీసీలకు 42 శాతం ఇచ్చినప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ రిజర్వేషన్ల వ్యతి రేకులపై తీవ్రంగా మండిపడ్డారు. 1990లో మండల్ కమిషన్ ఉద్యమం సందర్భంగా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారికి ఎలాంటి గతి పట్టిందో ఒకసారి చరిత్ర చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ఇంచార్జ్ సూర్యనారాయణ, బీసీ కుల సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘురాం నేత, జెల్ల నరేందర్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మరపంగు వెంకన్న కర్నాటి లోకేష్, తదితరులు పాల్గొన్నారు.