NewsPolitics

రేపటి బంద్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాల్సిందే

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం.

హైదరాబాద్ : సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. కానీ  సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడిందని బీసీలకు రావలసిన వాటా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48% రిజర్వేషన్ల సాదాన్నే లక్ష్యంగా 18న తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా శుక్రవారం గుజ్జ సత్యం నేతృతంలో సుమారు 1000 మంది విద్యార్థులు విద్యానగర్ నుండి ఓయూ ఎన్సిసి గేటు వరకు బంద్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు ను అందుకుని ప్రతి పల్లె నుండి రాష్ట్రవ్యాప్తంగా బంద్ బ్రహ్మాండంగా జరగబోతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాలు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు బంద్ కు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కనివిని ఎరుగని రీతిలో రేపటి బంద్ జరగబోతుందని దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లేనిపక్షంలో రిజర్వేషన్లపై ఇదే తరహాలో ఉద్యమ కార్యచరణ దేశవ్యాప్తంగా ఉంటుందని హెచ్చరించారు.