42% రిజర్వేషన్ల అమలు వెంటనే చేపట్టాలి – గుజ్జసత్యం

42% రిజర్వేషన్లను అమలు వెంటనే చేపట్టాలి
తెలంగాణ బీసీ బిల్లుకు అఖిలపక్ష మద్దతు కోసం భవిష్యత్ కార్యాచరణ
ప్రభుత్వ భూములు అమ్మరాదు
ప్రభుత్వ హాస్టళ్ళు – గురుకులాలు స్వంత భవనాలు నిర్మించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
హైదరాబాద్, మార్చి 26(సత్య తెలంగాణ): అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఈ బిల్లు అమలు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అమ్మకుండా ప్రభుత్వ హాస్టళ్ళకు గురుకులాల స్వంత భవనాలు నిర్మించాలని ఆయన కోరారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీ బిల్లు చట్టం చేయాలని, వెంటనే ఈ బిల్లు లకు ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని కోరారు. బీహార్ లో, తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. తర్వాత కొందరు కోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసింది. ఈ ధపా సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలుస్తుంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీ చట్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూఎస్ కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కొనాలలో చూస్తే కేసు గెలుస్తుంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కావున కేసు గెలుస్తుంది.
జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బిహార్ లో ఇటీవల అసెంబ్లిలో బిల్లు పాస్ అయిన ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఉద్యోగాలు కూడా భర్తీ చేశారు. ఆ తరువాత కోర్టులో కేసు వేశారు. ఇక్కడ కూడా మొదట న్యాయ నిపుణులను సంప్రదించాలి. అని సలహా ఇచ్చారు. ఈ ప్రక్రియ అంత పాటించి కూడా కేంద్రం మీద నెత్తి చేతులు దులుపు కోరాదు. మొత్తం ప్రణాళిక పాటించాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు – ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్ కు నిర్మాణానికి ఉపయోగించాలి. అంతే గాని అమ్మడానికి కాదు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉంటుందని ప్రశించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాని ఆపేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి అమ్మడం ఆపేయాలి. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదు. ఇది బీసీ/ఎస్‌సి/ఎస్‌టి కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు, పేదలకు ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేదలకు పంచాలని కోరారు. ముఖ్యమంత్రి ఇప్పుడు గచ్చిబౌలి స్థలాలు అమ్ముతారు. విద్యార్థులు ఇలాగే నిశ్శబ్దం ఉంటే భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీలో 800 ఎకరాలు ఇతర భూములు అమ్ముతారు. అందుకే విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే పార్లమెంటులో చర్చ లేపుతామని హెచ్చరించారు.
మన రాష్ట్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 295 హాస్టళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ఒక హాస్టల్ కి కూడా స్వంత భవనం లేదు. హాస్టళ్ళు ప్రారంభించి 27 సంవత్సరాలు అవుతున్న ఒక దానికి కూడా స్వంత భవనాలు లేకపోవడం అన్యాయం. అలాగే 320 బి.సి గురుకులాలకు స్వంత భవనాలు లేవు. అన్నీ ప్రభుత్వ ఆఫీసులకు స్వంత భవనాలు యున్నవి. అన్నీ పాఠశాలలకు స్వంత భవనాలు యున్నవి. కానీ కేవలం బి.సి హాస్టళ్ళకు, గురుకులాలకు ఒక్క స్వంత భవనాలు నిర్మించకపోవడంతో న్యాయం ఏమైనయుందా! చివరకు వందల కోట్ల రూ. పెట్టి ఫ్లై ఓవర్స్, స్కై ఓవర్స్ అండర్ వేవర్స్ నిర్మిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొనే, బి.సి విద్యార్ధులకు స్వంత భవనాలు నిర్మించాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు. దీని మూలంగా మానవ వనరులను తీర్చిదిద్దవలసిన హాస్టళ్ళు, గురుకురాలు – సౌకర్యాలు లేక జ్ఞాన వికాసం పొందలేక పోతున్నారు. ఇది ఎదుగుతున్న సమాజనికి నష్టం. ఇది బిసి విద్యార్ధులకు నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. అంటే కాదు మానవ వనరులను తీర్చి దిద్దా లేకపోతున్నాం. ఇది దేశానికి తీరని నష్టం. స్వంత భవనాలు లేకపోవడం వలన అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలలో చాలీ-చాలని వసతులతో విద్యార్థులు కిక్కిరిసి యున్నారు. దీని వలన విద్యార్థులు ఆరోగ్యం దెబ్బతింటుంది. చదువు దెబ్బతింటుంది. పైగా ఏటా అద్దె కింద కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కావున అన్ని వసతులతో స్వంత భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, జిల్లాపెల్లి అంజి , జెల్ల నరేందర్ , సూర్యనారాయణ , అనంతయ్య , రఘుపతి, భాగ్యలక్ష్మి, వెంకటేష్, నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.