NewsPoliticsViral

బీసీలకు అన్యాయం చేస్తే ఖబర్దార్ బీసీ బిల్లు పై రాజకీయాలెందుకు – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

హైదరాబాద్, ఏప్రిల్ 19(సత్య తెలంగాణ): బీసీలకు న్యాయంగా రావాల్సిన 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై అన్యాయం చేయాలని చూస్తే రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హాజరై మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రతిపక్షాలు బీసీలను రాజకీ యాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి స్థితిగతు లను మార్చడం లేదన్నారు. బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసే కుట్రలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాళ్లు ఇచ్చే వాళ్ళు కాదు మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలన్నారు. పిడికిలి బిగించి రాజ్యాధికారం కోసం పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారా మనం రాష్ట్రాన్ని సాధించుకున్నామని అదే పోరాట ప్రతిభ చూపించి బీసీల హక్కులను, 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి 9వ షెడ్యూల్లో అమలు పరచాలన్నారు. ఈ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కష్టయ్య, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు,  జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ ఈశ్వరయ్య, సమన్వయకర్త ఆళ్ల రామకష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజకష్ణ, కోళ్ల జనార్ధన్, నరేందర్ ,పగిళ్ల సతీష్,మోడీ రాందేవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.