విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర బంద్ – గుజ్జ సత్యం

సత్య తెలంగాణ హైదరాబాద్ : అఖిలపక్షాల మద్దతుతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం నేతృత్వంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలను రోడ్ల పైనే నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలు ముందుగానే సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అక్కడక్కడ వ్యాపార సంస్థలు తెరిచి ఉన్న వాటిని బీసీ నేతలు మూసివేయించారు. ఎల్బీనగర్ మహనీయుల విగ్రహాల వద్ద మహనీయులకు నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ లకు రావలసిన 42 శాతం న్యాయమైన వాట దక్కలిసిందే అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. కానీ సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడిందని బీసీలకు రావలసిన వాటా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు బీసీ బిల్లుకు మద్దతిస్తున్న ఎందుకు అమల్లోకి రావడం లేదు ఆలోచించాల్సిన విషయం అన్నారు. ఈ కా ర్యక్రమంలో మాజీ ఐఏఎస్ చిరంజీవిలు, జస్టిస్ ఈశ్వరయ్య, విషాధారణ్ మహరాజ్, కె.వి గౌడ్, చమకుర రాజు, బొమ్మ రఘురాం నేత, ఎరమాద వెంకన్న, జిల్లా నరేందర్, పెద్ది జగదీష్ సల్వాచారి, తదితరులు పాల్గొన్నారు.