రాష్ట్ర బంద్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు కూడగడుతాం – గుజ్జ సత్యం

అక్టోబర్ 16 : బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర బంద్ లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు
హైదరాబాదులోని కాచిగూడ లో ఉన్న హోటల్ అభినంద్ గ్రాండ్ లో ఈనెల 18న చేపట్టబోయే రాష్ట్ర బంద్ కు మద్దతుగా 130 బీసీ కుల సంఘాలు 30 బీసీ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది.
గుజ్జ సత్యం మాట్లాడుతూ పెంచిన బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి అనేకమంది కుట్రలకు పాల్పడుతున్నారని ఇందుకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులను ఎండగట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు సాధన కోసం ఇబ్బందును చేపట్టడం జరుగుతుందని , బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు రాజకీయ ప్రాతిథ్యం పెరుగుతుందని అంతిమంగా రాజ్యాధికారంలో బీసీలకు జనాభా దామషా ప్రకారం వాట దక్కుతుందన్నారు.
బీసీల బందుకు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందని సబండవర్గాలు కులాలు ఈ సమయంలో ఏకమై రాజకీయ పార్టీల పెద్దగా బందులో పాల్గొని బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణలోని ప్రజలు వ్యాపారులు విద్యాసంస్థలు పెట్రోల్ బంక్ యజమాన్యాలు, ఆర్టీసీ, రవణ వ్యవస్థ బందు రోజు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బంద్ నిర్వహించడం ద్వారా బీసీ డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించ గలుగుతామని, గల్లీ నుండి ఢిల్లీ దాకా సెగ పుట్టించడానికి ఇబ్బందు నిర్వహిస్తున్నామని అన్నారు.