నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే
నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే..
సినీరంగంలో ఆడవాళ్ళపై లైంగిక వేధింపులు చర్చ ఈ మధ్య బాగా కొనసాగుతున్నది. ఈ విషయమై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత కూడా గొంతు విప్పారు. ఒక వెబ్ చానల్ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
‘నా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారున్నారు. అలాంటివాళ్లు ఈ ప్రపంచంలో ప్రతి చోటా వుంటారు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు అక్కడ వుండటానికి నేను అస్సలు ఇష్టపడేదాన్ని కాను. వాళ్లను మళ్లీ కలిసేదాన్ని కాను. దాంతో నాకు పొగరని అనుకునేవారు. నా వ్యక్తిత్వం వల్ల వాళ్ళ ఈగో హర్ట్ అయ్యేది. ఆ కారణంతో నాకు పరోక్షంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయినా నేను అలాంటి చాలా ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాది మ్యూజిక్ ఇండస్ట్రీ కాబట్టి నాకు ఇతరులతో పోల్చుకుంటే అన్ని ఇబ్బందులు ఎదురుకాలేవు ’ అని చెప్పారు సునీత.
తన గురించి అవాకులు చెవాకులు కూాడా ప్రచారం చేశారని ఆమె చెప్పారు. ” ఇల్లు కూలిపోతే తేరుకుని మళ్లీ కట్టుకోవచ్చు కదా. కానీ మనసుకి దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం. నాపై పుకార్లను ప్రచారం చేసేవాళ్ల వినీవినీ విసిగిపోయాను. నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే వీళ్లంతా చాలా హ్యాపీగా ఉంటారేమోనని అనిపించేది. కానీ.. నా పరిస్థితులన్నీ నాకు గుర్తుకొచ్చేస్తాయ్. నాకు మరో పనేది తెలియదు .. ఏ రిసెప్షనిస్ట్‌గా వెళ్లినా జాబ్ ఇస్తారు .. కానీ ఆ డబ్బుతో ఇల్లు గడవదు కదా..’ అని ఆవేదనతో చెప్పారు.