42 శాతం రిజర్వేషన్ల మోసానికి నిరాశతో ఆత్మహత్యా.. బీసీ యువకుడి ఘటనపై గుజ్జ సత్యం తీవ్ర ఆవేదన
- “బలిదానాలు కాదు… బలమైన పోరాటమే మార్గం”.

హైదరాబాద్, డిసెంబర్ 5, 2025: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, పీర్జాదిగూడలో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల మోసానికి నిరాశతో ఆత్మహత్యా చేసుకున్న సాయి ఈశ్వర చారి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన బీసీ-బహుజన సమాజాన్ని కలచివేసిందని, ఇటువంటి బాధాకరమైన సంఘటనలు ఇకపై పునరావృతం కాకూడదని ఆయన పిలుపునిచ్చారు.
“సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదాన ఘటన బాధాకరమైనది. ఇటువంటివి పునరావృతం కాకూడదు. నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే బాధతో నిన్న పీర్జాదిగూడ లో ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర చారి ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై నా ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.”అని అన్నారు
“మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ-బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం మన సమాజానికి ఎంతో బాధాకరం. తెలంగాణ సాధనలో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు తమ ప్రాణాలు అర్పించారు. ఇక చాలు. ఇక నుంచి బలిదానాలు కాదు, పోరాటమే మార్గం. మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన గౌరవం ఆత్మహత్యలతో రాదు — ఐక్యత, స్ఫూర్తి, రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది.”అని అన్నారు
“ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయకండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం ద్వారా, మన పోరాటం ద్వారా నిర్మించబడుతుంది. బీసీల రాజ్యాధికారం కోసం అందరం కలిసి పోరాడుదాం. అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం.”
మన హక్కుల కోసం పోరాటం ద్వారా సాధించుకోవాలని, ప్రాణ త్యాగాలు కాదని ఆయన చెప్పారు. “తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు — పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలి. మనకు మోసం చేసినవారికి ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి. మన మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుద్దాం — మన ఆశయాన్ని సాధిద్దాం.”అని అన్నారు

