బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ‘ప్రైవేట్ బిల్లు’ను ప్రవేశపెట్టాలి – గుజ్జ సత్యం

సత్యతెలంగాణ, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ శీతా కాల పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లుపై చర్చించకుంటే పార్లమెంట్ సభ్యుల ఇళ్లను ముట్ట డిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వా నికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయాల న్నారు. జీఓ.46ను సవరించాలని బీసీ కమిషన్ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీఓ నెం.46 కారణంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, పలు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్, వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మొదట తెచ్చిన జీఓ.9పై స్టే కొనసాగుతున్నప్పుడు మరో జీఓ ఎలా జారీ చేస్తారని ప్రశ్నిం చారు. జీఓ.46ను రద్దు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీసీల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు చిన్నచూపు చూసిన ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని హెచ్చ రించారు. రిజర్వేషన్లను తగ్గించి మోసం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మాడల్ అని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.
