ఓయూలో రెండో రోజు బీసీ విద్యార్థి దీక్ష విజయవంతం

బీసీలకు స్థానిక సంస్థలు,విద్యా,ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు సాధనకు కొమ్మనబోయిన సైదులు యాదవ్ అధ్యక్షతన కొనసాగుతున్న విద్యార్థి దీక్షలు ఓయూలో రెండో రోజు విజయవంతంగా కొనసాగింది.ఈ దీక్షకూ ముఖ్య అతిథులుగా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మేన్ చిరంజీవులు,బిసి జేఏసి కో చైర్మన్ గుజ్జ సత్యం,బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్,బాలగోని బాలరాజు గౌడ్ గారు హాజరయ్యారయ్యారు.వారు మాట్లాడుతూ బిసిలకు న్యాయంగా దక్కాల్సిన 42% రిజర్వేషన్ల సాధన కొరకు విద్యార్థులు ముందుండి కొట్లాడాలన్నారు.EWS రిజర్వేషన్ల అమలుకు అడ్డురాని 50% సీలింగి బిసి రిజర్వేషన్ల అమలుకు ఎలా అడ్డువస్తాయన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ ద్వారా బిసిలకు జనాభా దామాషా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.బిసి విద్యార్థి దీక్షకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు రామారావ్ గౌడ్,నిజ్జన రమేష్,సాంబశివ గౌడ్ ,రెడ్డి శ్రీను ముదిరాజ్,హంసా నామ సైదులు,ఒంటెద్దు నరెందర్,అవ్వారి భాస్కర్, కోట ఆనంద్,విద్యార్థి జేఏసీ గౌరవ అద్యక్షులు డా.జంపాల రిలయన్స్ రాజేష్, అధ్యక్షుడు చేరాల వంశి,వైస్ చైర్మన్ మామిడాల రవి,బారి అశోక్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి రమేష్ యాదవ్,జనరల్ సెక్రటరీ గణేష్ గౌడ్,సెక్రటరి సంతోష్,అశ్వణ్,శ్రీధర్,ప్రణయ్,వెంకట్,విద్యార్థి నాయకులు సిద్దు యాదవ్,శ్రీకాంత్ తదిరలు పాల్గొన్నారు.

