NewsPolitics

బిసి జేఏసి రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం

సత్య తెలంగాణ హైదరాబాద్ : బిసి జేఏసి రాష్ట్ర కో- ఆర్డినేటర్గా గుజ్జ సత్యం నియమితులయ్యారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 80 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బిసి జేఏసి ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా బిసి జేఏసి రాష్ట్ర కో- ఆర్డినేటర్గా గుజ్జ సత్యంకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిసి జేఏసి రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం మాట్లాడుతూ… తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తాన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో అన్ని పక్షాలను కలుపుకొని సాధిస్తామన్నారు. నాపై నమ్మకం ఉంచి నన్ను బీసీ జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా నియమించినందుకు గాను జేఏసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.