కోర్టులను వేదికగా చేసుకొని రిజర్వేషన్లను అడ్డుకుంటున్నరు: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

సత్య తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 9: బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు విధించిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెకేట్ చేయించాలని జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గురువారం హైకోర్టు తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన స్టేను తీవ్రంగా నిరసిస్తున్నామని, ఇది బీసీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామన్నారు, బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలన్నారు. తక్షణమే గవర్నర్ను కలిసి మాట్లాడాలన్నారు. పార్టీలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష కూటమిగా ఏర్పడి ప్రధానమంత్రి, రాష్ట్రపతిపై ఒత్తిడి తేవాలన్నారు.
బీసీ రిజర్వే షన్ల విషయంలో ఒక పార్టీపై ఇంకో పార్టీ నెపం వేస్తూ బీసీలను బలి పశువులు చేశాయని ఆయన మండిపడ్డా రు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల మేధావులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాయని గుజ్జ సత్యం వెల్లడించారు.