ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీ అభ్యర్థులకే వేయండి-గుజ్జ సత్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (సత్య తెలంగాణ): తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో బీసీలందరూ బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. సోమవారం ఆబిడ్స్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా ఉపాద్యాయ నియోజకవర్గం, కరీంనగర్ నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాద్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం, ఇదే నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రకులాల ఆధిపత్యంను ఒడించి బడుగుల ఆత్మగౌరవంను నిలబెట్టడానికి రాజకీయాలకు అతీతంగా ఐక్యం కావాలని, చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం పెరిగి బీసీల వాణి చట్టసభలలో వినిపించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలలను వేదిక చేసుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముగ్గురు బీసీలను గెలిపిస్తే వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీసీలకు వంధ శాతం రాజకీయా అధికారం సిద్ధిస్తుందని, బీసీ సీఎం అవడం ఖాయమని గుజ్జ సత్యం అన్నారు. అందువల్ల బీసీలందరూ చైతన్యవంతమై బీసీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీసీ రాజ్యాధికార సాధన కోసం నేటి నుంచే బీసీలు తమ ఐక్యతను ప్రదర్శించేందుకు ముందుకు రావాలని సూచించారు.