మూడు తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ – గుజ్జ సత్యం

మూడు తరాల ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన స్ఫూర్తితో బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు.తెలంగాణ జాతిపితగా పిలువబడే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితానికి సంబంధించిన అనేక కోణాలను ఆవిష్కృతం చేస్తూ రూపొందించిన యూనిటీ చిత్రాన్ని బుధవారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించినట్టు చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోపాటు సినీ నటి పూనమ్ కృష్ణమోహన్ కౌర్ పాల్గొని మాట్లాడారుచిత్ర దర్శకులు బడుగు విజయకుమార్ ప్రతిభా పాటవాలను కొనియాడారుచిత్ర నిర్మాత ధనుంజయ ప్రయత్నాన్ని అభినందించారు.
డాక్యుమెంటరీ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వకుళాభరణం, విశిష్ట అతిథులు గా బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే కిషోర్ గౌడ్ ,విమలక్క, ఎంబీసీ టైమ్స్ అధినేత సంగం సూర్యారావు, దుండ్ర కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, రిపబ్లికన్ పార్టీ, వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు వంగరి రమణ మోహన్. ముప్పిడి సత్యనారాయణ, రోషం బాలు, మాజీ ఎమ్మెల్యే ఎన్నాల శ్రీరాములు, మచ్చ సుధాకర్, రాపోలు జ్ఞానేశ్వర్, గోశిక యాదగిరి, గుండేటి శ్రీధర్, గజం గురునాథం, గడ్డం వెంకటేశం, రామనర్సయ్య, మధు, భాను, మహేశ్, రాజు, సతీశ్ చారి, కూరెళ్ల శ్రీనివాస్, చిలివేరు మృత్యుంజయ వివిధ కళాకారులు సంఘాల నేతలు, ప్రముఖ సామాజికవేత్తలు ,వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.