గాంధీ దవాఖానలో అందించే సేవల వివరాలు…
ఇది 1954 సెప్టెంబరు 14న “పీపుల్స్ మెడికల్ కాలేజి”గా ప్రారంభమైంది. అప్పటిలో ఇది హుమాయూన్ నగర్‌లో ప్రస్తుతం “సరోజినీదేవి కంటి ఆసుపత్రి” అన్న స్థలానికి సమీపంలో ఉండేది. వైద్య విద్యావసరాలకు ఉస్మానియా మెడికల్ కాలేజి చాలనందున ఇది ప్రాంభించారు. డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా 1954 మేనుండి 1956 జూలై వరకు పనిచేశాడు. 1955 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేత ఈ కళాశాల ప్రాంభోత్సవం జరిగింది. 1956 నాటికి కళాశాల ఆర్థికమైన ఇబ్బందులనెదుర్కోవడం వలన హైదరాబాదు ప్రభుత్వం ఈ కళాశాలను తన అధీనంలోకి తీసుకొంది. 1958లో కాలేజిని బషీర్‌బాగ్‌కు తరలించారు. 2003లో కాలేజిని మరల ముషీరాబాద్‌కు తరలించారు.
కాలేజి టీచింగ్ హాస్పిటల్ 1851లో ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం (infirmary) గా మొదలయ్యింది. 7వ కింగ్ ఎడ్వర్డ్ పేరుమీద దీనికి KEM హాస్పిటల్ అని పేరు పెట్టారు. 1958లో దీని పేరును “గాంధీ హాస్పిటల్”గా మార్చారు.
యేటా ఈ హాస్పిటల్‌లో 80,000 మంది ఔట్‌పేషెంట్లు, 42,000 మంది ఇన్‌పేషెంటులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ 11,000 పెద్ద శస్త్ర చికిత్సలు, 15,000 చిన్న శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. హాస్పిటల్‌లో 27 డిపార్టుమెంటులున్నాయి.
1954-2003 మధ్యకాలంలో 6090 విద్యార్థులు వైద్యవిద్యలో జాయిన్ అయ్యారు. 1950-1960 దశకాలలో కాలేజి, హాస్పిటల్ అనుసంధానించబడ్డాయి. 1970 దశకంనుండి సూపర్-స్పెషాలిటీ విభాగాలలో (కార్డియాలజీ, కార్డియో ఠొరాయిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి) అభివృద్ధి అధికంగా ఉంది
నగరంలోని పేద ప్రజలకే కాకుండా, జిల్లాల నుంచి వచ్చే వారికి ఉచితంగా సేవలందిస్తూ ధర్మాసుపత్రిగా పేరొందింది గాంధీదవాఖాన. కార్పొరేట్ దవాఖానల తరహాలో వైద్యసేవలందిస్తూ ప్రజల ఆధరాభిమానాలను చూరగొంటున్న ఈ దవాఖానలో రోజువారీగా అందే వైద్య సేవల వివరాలు మీ కోసం.
ఉదయం : 8.30గం. నుంచి 11గం.వరకు పేషెంట్లకు ఔట్‌పేషెంట్ విభాగంలో రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అనంతరం ఉదయం 9గం.నుంచి 12 గం.వరకు డాక్టర్లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
జనరల్ మెడిసిన్ : ప్రతి రోజు
డెంటల్ సర్జరీ : ప్రతి రోజు
కార్డియో థొరాసిస్ సర్జరీ: మంగళ, గురువారాలు
న్యూరో సర్జరీ: సోమ, శుక్రవారాలు
గ్యాస్ట్రో ఎంట్రాలజీ: బుధ, శనివారాలు
ఆర్థోపెడిక్ సర్జరీ: ప్రతి రోజు
కార్డియాలజీ: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు
న్యూరాలజీ: మంగళ, గురువారాలు
ఫిజియో థెరపీ: ప్రతి రోజు
నెఫ్రాలజీ: బుధ, శనివారాలు
డెర్మటాలజీ (చర్మం): ప్రతి రోజు
లెప్రసీ: సోమ, బుధ, శుక్రవారాలు
ఆప్తమాలజీ: (కంటి) ప్రతిరోజు
ఎంక్రినాలజీ, డైటీషన్: గురు, శుక్రవారాలు
పిడియాట్రిక్ సర్జరీ: గురు, శుక్రవారాలు
టీబీ (క్షయ): ప్రతి రోజు
జనరల్ సర్జరీ: 6 యూనిట్లు ప్రతిరోజు
ఫ్యామిలీ ప్లానింగ్: ప్రతిరోజు
మందుల పంపిణీ: ఉ. 9గంటల నుంచి మ. 12 గం.వరకు
ఈసీజీ : అవుట్ పేషంట్లకు ఉ 9గం. నుంచి మ12గం.వరకు
ఔట్ పేషెంట్ ల్యాబోరేటరీ: ఉ.9 గంటల నుంచి మ. 12గం.వరకు
ఔట్ పేషెంట్ ఎక్స్‌రే: ఉ.9గంటల నుంచి మ. 2గంటల వరకు
ప్లాస్టిక్ సర్జరీ: సోమ,గురువారాలు ఉ.11గం. నుంచి మ 1గం.వరకు
యురాలజీ: రెండు యూనిట్లు: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు
ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు): సోమ, మంగళ, గురు, శనివారాలు
పిడియాట్రిక్ మెడిసిన్: రెండు యూనిట్లు: సోమవారం – శుక్రవారాలు
గైనిక్ యూనిట్లు ఐదు: సోమవారం నుంచి శుక్రవారం వరకు
మార్చురీ: ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు