17 ఏళ్ల తరువాత భారత్‌కు మరోసారి మిస్ వరల్డ్ టైటిల్…సాధించిన “మనుషి” గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
17 ఏళ్ల తరువాత భారత్‌కు మరోసారి మిస్ వరల్డ్ టైటిల్…సాధించిన “మనుషి” గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
1966 రియెటా ఫరియా… 1994 ఐశ్వర్యారాయ్… 1997 డయానా హేడెన్… 1999 యుక్తాముఖి… 2000 ప్రియాంకా చోప్రా… ఏంటీ ఈ లిస్ట్ అని ఆశ్చర్యపోతున్నారా ? ఏమీ లేదండీ.. ఈ పేర్లన్నీ చూస్తే మీకు ఈ పాటికే ఓ విషయం అర్థమైపోయి ఉండాలే ? అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. వీరు ఆయా సంవత్సరాల్లో ఎంపిక కాబడిన మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్స్. తెలిసింది కదా.. మొత్తం ఇప్పటి వరకు కేవలం 5 మంది భారతీయ యువతులకు మాత్రమే ఇప్పటి వరకు మిస్ వరల్డ్ టైటిల్స్ వచ్చాయి.
చివరి సారిగా 2000వ సంవత్సరంలో ప్రియాంకా చోప్రాను ఆ అదృష్టం వరించింది. అయితే తాజాగా ఇప్పుడు.. అంటే ఏకంగా 17 ఏళ్ల తరువాత మళ్లీ ఆ అదృష్టం ఓ భారతీయ యువతికి దక్కింది. ఆమే.. మనుషి చిల్లర్.