Health

కళ్ళ కింద నల్ల మచ్చల తో భాదపడుతున్నారా ..! ఒక్క రాత్రిలో తొలగించే సింపుల్ చిట్కా అందరికి తెలియజేయండి.

కళ్ళ కింద నల్ల మచ్చల తో భాదపడుతున్నారా ..! ఒక్క రాత్రిలో తొలగించే సింపుల్ చిట్కా అందరికి తెలియజేయండి.

సింపుల్ చిట్కా

చింతపండు కొద్దిగా క్షార గుణం కలిగి ఉంటుంది. కాబట్టే పులిత్రేనుపులకు, కడుపు ఉబ్బరంతో కూడిన జ్వరం, వికారం, విదాహము మొదలైన రోగాలకు ఔషధంగా వాడతారు. ఆరుచెంచాల చింతపండురసం ఉదయమే సేవిస్తే ఆకలి కలిగిస్తుంది. వాపులకు, నొప్పులకు చింతపండు రసం, ఉప్పు కలిపి మర్దనచేస్తారు. బెణుకులకు, వాపులకు చిక్కటి చింతపండు రసం ఉడికించి పూస్తే నొప్పి తగ్గుతుంది. నోటిలో చిగుళ్ళు వాచి నెత్తురు కారుతూంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతీసారి బోజనం అయిన తరువాత బాగా పండిన చింతపండు కొద్దిగా తింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది.అజీర్ణ రోగాలగు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. నాలుగైదు చుక్కలు చింతపండు రసం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలలో కలిపితే పాలు విరిగి నీళ్ళు పైన తేరతాయి. పాలు విరగ గొట్టగా వచ్చిన తేటనీరు రోజుకు మూడు పూటలా తాగాలి. ఈ పాల తేటనీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి. అంతేకాదు సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూండాలి.

మన దేశంలో దక్షణాది రాష్ట్రాల వారు ప్రతిరోజూ చింతపండుతో తయారుచేసుకున్న చారు, సాంబరు (పప్పుపులుసు) తింటారు కాబట్టే వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశపు సమస్యలు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.ఇక విషయానికి వస్తే చింతపండు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు, బ్లాక్ హెడ్స్ పోవటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. మొదట ముఖాన్ని ఫెస్ వాష్ తో శుభ్రం చేసుకొని చింతపండు రసాన్ని రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే వచ్చే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కంటి కింద నల్లటి వలయాలకు చింతపండు రసం మంచి పరిష్కారం. చింతపండు రసాన్ని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాస్తే నల్లటి వలయాలు మాయం అవుతాయి. అయితే ఒక వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై మృత కణాలను తొలగించడానికి చింతపండు రసం పాలతో కలిపి స్ర్కబ్‌తో రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అంతే మీ ముఖం పై వచ్చే మచ్చలు నెమ్మదిగా మటుమాయం అవుతాయి…అలాగే చింతగింజల పొడికి అపూర్వ ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి శుభ్రమైయిన నీటితో రోజుకు మూడు పర్యాయాలు పుచ్చుకుంటే ఆమశంక, జిగట విరేచనాలు నివారింపబడతాయి. అర్ధ పెద్ద చెంచాడు చింతగింజల పొడి రోజుకు రెండుసార్లు తేనే అనుపానంతో సేవిస్తే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి రుచికి కావలసినంత పంచదార కలిపి రాత్రిపూట భోజనానికి ముందు రెండు వారాలపాటు తీసుకుంటే వీర్యస్కలనాన్ని నివారిస్తుంది.చింత చిగురుతో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటారు. ఇందులో విటమిన్లు, ఎ, సిలు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. చింతకర్ర కాల్చగా వచ్చిన చింతబొగ్గు పొడి, తగినంత ఉప్పుపటిక, పిప్పరమెంటు పూవు చేర్చి పండ్లపొడి తయారుచేస్తారు. నువ్వుల నూనెలో చింతబొగ్గుల పొడిచేర్చిన ముద్ద కాలిన పుళ్ళను శీఘ్రంగా మాంచుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *