NewsPolitics

రిజర్వేషన్ల అంశం చర్చించడానికి అఖిల పక్షంతో బి.సి కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చ జరపాలి 96 కుల సంఘాల – 30 బి.సి సంఘాల నాయకుల డిమాండ్

హైదరాబాద్, మార్చి 19 (సత్య తెలంగాణ): అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకం. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజు సెంట్రల్ కోర్టులో 96 బి.సి. కుల సంఘాలు, 30బి.సి సంఘాల సమావేశానికి జాతీయ బి.సి సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, బి.సి సంఘం అధ్యక్షులు రాజారాం అధ్యక్షత వహించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి విసృతంగా చర్చించారు.

ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ ఈ బిల్లు చట్టం చేశారు. దీని అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి బీసీ బిల్లు అమలు చేయడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున లోతుగా చర్చించి అమలు కోసం పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో రెండు బిల్లులు ఉన్నవి. ఒక బిల్లుకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు శాతం నిర్ణయించే అధికారం రాజ్యంలోని 246 D6 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చారు. జనాభా లెక్కలు అసెంబ్లీ బిల్లు యున్నందున దీనికి డోకా లేదు. వెంటనే అమలు చేయవచ్చు. ఇంకా విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ అవకాశం పడవచ్చు. ఇలా రెండు బిల్లులుపై భిన్నభిప్రాయాలు ఉన్నందున దీనిపై నిపుణులతో చర్చించాలని కోరారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని కోరారు. బీహార్ లో, తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. తర్వాత కొందరు కోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి సవరణ చేసింది.

ఈ ధపా సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలిచే అవకాశం యుంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీ చట్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు EWO కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం యుంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కావున కేసు గెలుస్తుంది. అయిన దీనిపై ఇంకా చర్చించాలి. పకడ్బంది చర్చలు తీసుకోవాలి.

జయలలిత గతంలో 1992-1993లో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు అక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.

సత్యం మాట్లాడుతూ అలాగే బిహార్ లో ఇటీవల అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన ప్రభుత్వం GO జారీ చేసింది. ఉద్యోగాలు కూడా భర్తీ చేశారు. ఆ తరువాత కోర్టులో కేసు వేశారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఇక్కడ కూడా మొదట న్యాయ నిపుణులను సంప్రదించాలి. అని సలహా ఇచ్చారు. ఈ ప్రక్రియ అంత పాటించి కుండా కేంద్రం మీద నెత్తి చేతులు దులుపు కోరాదు. మొత్తం ప్రక్రియ పాటించాలని కోరారు.

రాజారాం యాదవ్ మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు పెంచాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లుకల్పించాలని, బీసీ విద్యార్ధులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.