NewsPolitics

42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కొరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మీది ఉద్యమించే బాధ్యత మాది – రాష్ట్ర ప్రభుత్వానికి గుజ్జ సత్యం సూచన

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జసత్యం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందేలా భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు కాచిగూడ లోని అభినందన్ గ్రాండ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ లో స్థానిక సంస్థల్లో బి.సి.లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో 42 శాతం రిజర్వేషన్లు బిల్లు అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి  కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో  ప్రవేశపెట్టి దీని షెడ్యూల్ 9 లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కాకుండా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఢిల్లీ వేదికగా కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు కదల వద్దన్నారు. దీనికి ఉదాహరణగా జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్  ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో  నీలం వెంకటేష్ కోలా జనార్ధన్, జెల్ల నరేందర్ , రామకోటి , అనంతయ్య , భాగ్యలక్ష్మి , జల్లేపల్లి కిరణ్, రఘుపతి,  పాల్గొన్నారు.